Bapu : ఆసక్తి రేపుతున్న ‘బాపు’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేసింది, ఇది డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ‘బాపు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. పోస్టర్‌లో హాయిగా డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ ఒక కుటుంబం గుమిగూడి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించడం కనిపిస్తోంది, ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించడం ఆసక్తికరంగా వుంది.
Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!
Also Read
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం యొక్క ఎమోషనల్ జర్నీగా ఉంటుంది. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతుందో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషనల్ గా హత్తుకునే నెరేటివ్ తో సినిమా ఉండబోతోంది. కొంత గ్యాప్ తర్వాత బ్రహ్మాజీ లీడ్ రోల్ లో నటించడంతో ‘బాపు’పై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. బ్రహ్మాజీతో పాటు ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ వంటి అనుభవజ్ఞులైన నటులను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ తో ఉంటుంది. ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ ఆలయం ఎడిటర్. డార్క్ హ్యుమర్, ఎమోషనల్ డెప్త్, ప్రతిభావంతులైన నటీనటులు కలయికలో వస్తున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది.
తాజావార్తలు
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!