Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?

Prabhas Spirit

Prabhas Spirit

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం సృష్టించిందని ప్రణయ్ చెప్పారు.

ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం మరింత భారీ స్కేల్‌లో ఉండబోతోందని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని వేల కోట్ల స్థాయి కలెక్షన్లు రాబడుతుందనే ప్రశ్నపై స్పందిస్తూ… అది అంతిమంగా ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అలానే’అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹50 కోట్లు వసూలు చేసినప్పటికీ, విడుదలకు ముందు సినిమాపై నమ్మకం లేక డిస్ట్రిబ్యూటర్లతో కుదుర్చుకున్న డీల్స్ కారణంగా నిర్మాతగా తమకు దక్కిన మొత్తం చాలా తక్కువని ప్రణయ్ తెలిపారు. తాము పెట్టిన పెట్టుబడి మాత్రమే వెనక్కి వచ్చిందని, సాధారణంగా వచ్చే మార్జిన్ కంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లే ఈ సినిమా ద్వారా భారీగా లాభపడ్డారని చెప్పారు.