సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read : Pooja Hegde : ప్రభాస్ సోషల్ మీడియాను వదిలేయాలనుకుంటున్నాడు
ఈ చిత్రంలో తన పాత్ర గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “నేను వారణాసిలో ఒక మహా శివ భక్తుడిని” ఈ పాత్ర చాలా శక్తివంతంగా, ఆధ్యాత్మికతతో కూడి ఉంటుందని మహేశ్ కు తండ్రిగా నటిస్తున్నాను అని’ పేర్కొన్నారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవబోతోందని సమాచారం. తెలుగు తెరపై తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మహేష్ బాబు మరియు ప్రకాష్ రాజ్ నిలుస్తారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘మహర్షి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘వారణాసి’ చిత్రంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. మరోసారి తండ్రి-కొడుకులుగా వీరు అలరించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వాల్రడీ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
