ప్రభాస్ వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అయితే మరో అరడజను సినిమాలను లైన్ పెట్టాగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్‌కు రెడి అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్ 2’, ‘కల్కి 2898ad’ పార్ట్ 2 సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం వీటి తర్వాత వచ్చే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు..
ఎందుకంటే ఈ మూవీలో ఓ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ తన విధ్వంసాన్ని చూపెట్టనున్నాడు. కాగా 2023 డిసెంబర్‌లో ‘యానిమల్’ మూవీని రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ మూవీ కథ కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డాడు. అలాగే కథ ఫైనల్ అయ్యాక స్క్రీన్ ప్లే కోసం మరో 6 నెలలు గడిపాడట. మొత్తంగా బాండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసిన సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం మిగిలిన నటీనటుల వెతుకులాట మొదలెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ స్లిమ్ లుక్‌లోకి మారుతాడని.. అందుకే ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాల టాక్. అంతేకాదు ఇక ఈ మూవీ షూటింగ్ ఇండియాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందట. అందుకే ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన స్పిరిట్ చిత్రం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమే.