పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని” అని చెప్పారు.
Also Read : K Ramp : మీరిచ్చిన సక్సెస్‌ను మీతోనే సెలబ్రేట్ చేసుకుంటా.. కిరణ్ అబ్బవరం
కాగా టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ సంస్థలు భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీ నుండి తాజా సమాచారం ప్రకారం, సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేస్తున్నారట. ఈ సీక్వెన్స్‌లో ప్రభాస్ సాలిడ్ యాక్షన్‌లో కనిపించనున్నారు. దాదాపు వందమంది జూనియర్స్ కూడా ఈ సీన్‌లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేస్తారని తెలుస్తోంది. ఇంకా, సినిమా మెయిన్ కథాంశం చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగా నుండి మరో వినూత్న సినిమా రాబోతుందని ట్రేడ్ టాక్‌లో వెల్లడైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.