పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న “స్పిరిట్” సినిమా చుట్టూ రోజురోజుకు భారీ బజ్ క్రియేట్ అవుతుంది. భద్రకాళి పిక్చర్స్, టి–సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, “యానిమల్” ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన రూమర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Deepika-Prabhas : ప్రభాస్ తో మూవీ అయితే 8 గంటలు.. SRK దగ్గర మాత్రం ఎన్ని గంటలైనా ఓకేనా?
తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ మరియు రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు “స్పిరిట్” సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహదాన్ ఇప్పటికే సందీప్ వంగా టీమ్‌లో చేరాడనే టాక్ బలంగా ప్రచారం అవుతోంది. రిషి మనోజ్ విషయం పై మాత్రం అధికారిక క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే రూమర్ కూడా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. “స్పిరిట్ మరో లెవల్ ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా అవుతుందని” సినీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.