Site icon NTV Telugu

Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు

Triptii Dimri

Triptii Dimri

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి.

Also Read:Pakistan: భారత్‌లో ఉంటూ.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. కట్ చేస్తే..

మొదట, ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, సందీప్ రెడ్డి వంగాతో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా దీపికా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తాజా సమాచారం. దీపికా తప్పుకోవడంతో, సందీప్ రెడ్డి వంగా కొత్త హీరోయిన్ కోసం ఇతర నటీమణులను పరిశీలించారు. ఈ క్రమంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్, ‘సప్తసాగరాలు దాటి’లో అద్భుత నటనతో ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే తెలుగు, హిందీ సినిమాల్లో తన సత్తా చాటుకోవడం, రుక్మిణీ ఎమోషనల్ రోల్స్‌లో మెప్పించడం వీరి ఎంపికకు కారణమైనట్లు తెలుస్తోంది.

Also Read: Siraj : ఏడేళ్లు హైదరాబాద్‌లో సిరాజ్‌ మకాం.. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో…

అయితే, ఈ ఇద్దరి పేర్లు కేవలం పరిశీలనలో ఉన్నాయని, ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. తాజాగా, ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా టీం. ‘యానిమల్’లో భాభీ 2 పాత్రతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తృప్తి, యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. సందీప్ రెడ్డి వంగాతో ఆమెకు ఇప్పటికే మంచి వర్కింగ్ రిలేషన్ ఉండటం, ఆమె నటనా నైపుణ్యం ఈ ఎంపికకు బలం చేకూర్చాయని టాక్. తృప్తి డిమ్రీతో పాటు, సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం, దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఆకర్షణగా నిలవనుంది.

Official Tweet from Vanga

Exit mobile version