Site icon NTV Telugu

Prabhas : కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ బంపర్ ఆఫర్..

Prabas

Prabas

సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని, వెండితెరపై తమ కథను చూపించాలని కోట్లాది మంది యంగ్ డైరెక్టర్స్ కలలు కంటుంటారు. కానీ, సరైన ప్లాట్‌ఫామ్ దొరక్క చాలా మంది వెనకబడిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్ల కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక అద్భుతమైన ప్లాన్ తో రాబోతున్నాడు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ‘ఫెస్టివల్’ను ప్రారంభిస్తూ కొత్త దర్శకులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి.. మీ కథలే మీ కెరీర్‌ను మారుస్తాయి’ అంటూ ప్రభాస్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

ఈ వినూత్న ప్రయత్నానికి సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి వంటి స్టార్ డైరెక్టర్లు కూడా తోడవ్వడం విశేషం.. ‘షార్ట్ ఫిలిం మేకింగ్ అనేది దర్శకుడిగా మీ మొదటి అడుగు’ అని సందీప్ రెడ్డి అంటే, ‘నేను అనుదీప్‌ను ఒక షార్ట్ ఫిలిం చూసే గుర్తుపట్టాను’ అని నాగ్ అశ్విన్ తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు 2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ పోటీలో ఆడియన్స్ ఓట్లు, రేటింగ్స్ ఆధారంగా విన్నర్స్‌ను ఎంపిక చేస్తారు.

అంతేకాదు, సెలక్ట్ అయిన టాప్ 15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు ‘క్విక్ టీవీ’ బ్యానర్‌పై ఏకంగా గంటన్నర నిడివి గల సినిమా తీసే లక్కీ ఛాన్స్ కూడా లభిస్తుంది. దీనికి కావాల్సిన పూర్తి నిర్మాణ సహకారాన్ని వారే అందిస్తారు. సినిమా కలను నిజం చేసుకోవాలనుకునే యువతకు ప్రభాస్ కల్పించిన ఈ వేదిక నిజంగా ఒక వరం లాంటిదే. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర మంచి కథ ఉంటే కెమెరా పట్టుకుని కదిలిపోండి!

 

Exit mobile version