Prabhas : కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ బంపర్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని, వెండితెరపై తమ కథను చూపించాలని కోట్లాది మంది యంగ్ డైరెక్టర్స్ కలలు కంటుంటారు. కానీ, సరైన ప్లాట్‌ఫామ్ దొరక్క చాలా మంది వెనకబడిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్ల కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక అద్భుతమైన ప్లాన్ తో రాబోతున్నాడు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ‘ఫెస్టివల్’ను ప్రారంభిస్తూ కొత్త దర్శకులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి.. మీ కథలే మీ కెరీర్‌ను మారుస్తాయి’ అంటూ ప్రభాస్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ వినూత్న ప్రయత్నానికి సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి వంటి స్టార్ డైరెక్టర్లు కూడా తోడవ్వడం విశేషం.. ‘షార్ట్ ఫిలిం మేకింగ్ అనేది దర్శకుడిగా మీ మొదటి అడుగు’ అని సందీప్ రెడ్డి అంటే, ‘నేను అనుదీప్‌ను ఒక షార్ట్ ఫిలిం చూసే గుర్తుపట్టాను’ అని నాగ్ అశ్విన్ తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు 2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ పోటీలో ఆడియన్స్ ఓట్లు, రేటింగ్స్ ఆధారంగా విన్నర్స్‌ను ఎంపిక చేస్తారు.
అంతేకాదు, సెలక్ట్ అయిన టాప్ 15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు ‘క్విక్ టీవీ’ బ్యానర్‌పై ఏకంగా గంటన్నర నిడివి గల సినిమా తీసే లక్కీ ఛాన్స్ కూడా లభిస్తుంది. దీనికి కావాల్సిన పూర్తి నిర్మాణ సహకారాన్ని వారే అందిస్తారు. సినిమా కలను నిజం చేసుకోవాలనుకునే యువతకు ప్రభాస్ కల్పించిన ఈ వేదిక నిజంగా ఒక వరం లాంటిదే. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర మంచి కథ ఉంటే కెమెరా పట్టుకుని కదిలిపోండి!
Your story matters.
Your moment starts here.#TheScriptCraft International Short Film Festival is here, inviting storytellers from around the world to begin. – #Prabhas via Instagramhttps://t.co/31S7QdAWHu@TSCWriters pic.twitter.com/Gx2DlLH281— Prabhas FC (@PrabhasRaju) December 19, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..