Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్‌ మరోసారి జతకట్టనున్నాడా?

Prabhas Hanu Raghavapudi

Prabhas Hanu Raghavapudi

Prabhas-Hanu Raghavapudi: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్‌ కొనసాగుతున్న సమయంలోనే ప్రభాస్‌, డైరెక్టర్ హను రాఘవపూడి మధ్య క్రియేటివ్‌ బాండింగ్‌ మరింత బలపడినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’ తర్వాత కూడా ఈ కాంబినేషన్‌ కొనసాగుతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి ‘ఫౌజీ’ని తెరకెక్కిస్తున్న విధానం, ఆయన వర్కింగ్‌ స్టైల్‌ ప్రభాస్‌ను ఆకట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రభాస్‌ చేస్తున్న ఇతర సినిమాల సెట్స్‌లోనూ.. ‘ఫౌజీ’ విషయంలో డైరెక్టర్ పనితీరును ప్రశంసిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి డార్లింగ్ ఆయనతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత హను రాఘవపూడితో మరో కథ చేయడానికి ప్రభాస్‌ రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కించే అవకాశం ఉందట. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇదిలా ఉంటే.. ‘ఫౌజీ’ స్టోరీకి ప్రీక్వెల్‌ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో పరిశీలించవచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ, పాత్రలకు ఉన్న స్కోప్‌ను బట్టి ప్రీక్వెల్‌కు అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్‌-హను కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’పై భారీ హైప్‌ ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమా తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తారనే వార్త నిజమైతే డార్లింగ్‌ అభిమానులకు అది మరింత క్రేజీ కాంబినేషన్‌గా మారనుంది. డిసెంబర్‌ 3న ప్రభాస్‌ నటిస్తున్న ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.