Prabhas Fauji Release Date: హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తుంది. అలాగే, ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు ఇంకా 35 రోజుల పాటు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉందని టాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: Vijayawada Metro Rail: విజయవాడ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు..
అయితే, చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి సినీ వర్గాల్లో పలు ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. దేశ భక్తి అంశాలతో మిళితమై ఉన్న ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీ 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి ప్రీక్వెల్ చేసే ఆలోచనతో ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. కాగా, దీనిపై సినీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మూవీలో ప్రభాస్ భారత సైనికుడిగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇది 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది.