Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.
డిసెంబర్ 3న నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డిసెంబర్ 4న దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’, విశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వరుస క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో ప్రభాస్ మూవీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇంతటి భారీ చిత్రానికి థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ‘ఫౌజీ’ని వాయిదా వేస్తారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డిసెంబర్ 3 రిలీజ్ వాయిదా పడితే.. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
అయితే సంక్రాంతి సీజన్ కూడా ప్రభాస్‌కు అంత ఈజీగా కనిపించడం లేదు. ఇప్పటికే పండగ రేసులో పలు పెద్ద సినిమాలు తమ రిలీజ్‌లను ప్లాన్ చేసుకున్నాయి. అలాంటి సమయంలో ‘ఫౌజీ’ కూడా సంక్రాంతి బరిలోకి దిగితే బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఒక స్టార్ హీరో సినిమా కోసం మరో చిత్రాన్ని తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? లేక అందరూ తమ తమ తేదీలతోనే ముందుకు వెళ్తారా? అనేది కీలకంగా మారింది. ప్రస్తుతానికి ‘ఫౌజీ’ పోస్ట్‌పోన్‌పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే డిసెంబర్ రేసు నుంచి తప్పుకుంటే ప్రభాస్ ‘ఫౌజీ’కి సంక్రాంతే తదుపరి టార్గెట్ అవుతుందా? అన్న ప్రశ్న మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?