Keesara SI: కీసర పీఎస్‌లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keesara SI: కీసర పోలీస్ స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఖాకీల అక్రమార్జన తీరుపై ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల బుద్ధి మారడం లేదు. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మరువకముందే, తాజాగా మరో ఎస్సై అదే అవినీతి బాటలో నడిచి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.
చార్జ్‌షీట్ కోసం రూ.2 లక్షలు డిమాండ్
పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ వేయడానికి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) శ్రీనివాస్ బాధితుడి నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేని బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బాధితుడి వద్ద నుంచి ఎస్సై శ్రీనివాస్ రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
Also Read
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
- Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
- Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
- Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
మారని తీరు.. వరుస ఉదంతాలతో శాఖ పరువు గంగపాలు
కీసర పోలీస్ స్టేషన్లో కొద్దిరోజుల క్రితమే బాధితుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తూ సీఐ స్థాయి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. ఈ వ్యవహారం ఇంకా విచారణ దశలోనే ఉండగానే, అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనివాస్ కూడా లంచం తీసుకుంటూ దొరికిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకే పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలు వరుసగా అవినీతి కేసుల్లో పట్టుబడటం పోలీసు శాఖ పనితీరుపై, నిఘా వైఫల్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తే కేసులు నమోదు చేయాలన్నా, కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయాలన్నా లక్షల్లో లంచాలు ముట్టజెప్పాల్సి వస్తోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ భయం ఏమాత్రం లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇలాంటి అవినీతి అధికారులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, డిస్మిస్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Keesara SI: కీసర పీఎస్‌లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
-
Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
-
AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
-
Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!