Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే సినిమాకే కీ హైలెట్‌గా నిలవనున్న క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మొదలుపెట్టనున్నారట. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు.. ఏకధాటిగా నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ మహా క్లైమాక్స్ వార్ సీన్‌ను భారీ ఎత్తున తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ డిసెంబర్ 15 నాటి షెడ్యూల్ పూర్తయితే ‘ఫౌజీ’ మొత్తం టాకీ పార్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ అధికారికంగా ముగియనుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై తాజా సమాచారంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఫౌజీ కొంచెం వెనక్కి వెళ్తుంది కానీ.. అది వేరే లెవెల్ సినిమా! ‘బాహుబలి’ తర్వాత మీరు ప్రభాస్‌ను అంత గొప్పగా మళ్లీ చూడలేదు, ఆ రేంజ్ సినిమా ఇది. అభిమానులందరికీ చిన్న సారీ.. కాస్త రిలీజ్ విషయంలో వెనక్కి వెళ్తున్నాం. కానీ ఈ సినిమాను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, అంత అద్భుతమైన సినిమా” అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో సినిమాపై హైప్‌ని ఒక్కసారిగా పెంచేసింది. ఒకవైపు రిలీజ్ లేట్ అంటూనే, మరోవైపు బాహుబలి రికార్డులను గుర్తుచేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం ప్రస్తుతానికి మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు.
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
తాజావార్తలు
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!