ప్రభాస్ లైనప్‌లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి రిలీజ్‌తో పాటు, టీజర్ రిలీజ్ అలస్యం అవుతూ వస్తోంది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ని ఈ మే నెలలోనే రనిలీజ్ చేస్తామంటూ టీమ్ ప్రకటించింది. కానీ అది జరిగేలా కనిపించడం లేదు..
Also Read : COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..
మే నాలుగో వారంలో అడుగుపెట్టినా, ఇంతవరకూ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అవుతోందని, టీజర్ రెడీగా ఉన్నా ప్రభాస్ నుంచి ఇంకా అనుమతి రాలేదని రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్‌గా అసలు టీజర్ ఉందా లేదా అనే విషయంపై, మారుతీ సన్నిహితుడు, తన సహా నిర్మాత అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్ కె ఎన్, తాజాగా క్లారిటీ ఇచ్చాడు.. ‘మారుతీతో రీసెంట్‌గానే మాట్లాడ్డం జరిగింది.. ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుంది’ అని అసలు విషయం రివీల్ చేశారు. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకొక రెండు వారాలు ఓపిక పడితే చాలు. కానీ దీని గురించి కూడా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు నమ్మకం లేదు.