ఇప్పుడంతా స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా వాళ్ళ మూవీస్ స్పెషల్ షోస్ హంగామా సాగుతోంది. మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమాను అతని బర్త్ డే సందర్భంగా వరల్డ్ వైడ్ స్పెషల్ షోస్ వేయగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బర్త్ రోజున ‘జల్సా’ను ప్రదర్శించారు. దాంతో నందమూరి బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇలా స్పెషల్ షో అని కాకుండా ‘చెన్నకేశవరెడ్డి’ మూవీ విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిని రీ-రిలీజ్ చేశారు.
ఆ వారం కొత్తగా వచ్చిన సినిమాల కంటే కూడా ‘చెన్నకేశవరెడ్డి’ థియేటర్లలో మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇదిలా ఉంటే… ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పదేళ్ళ క్రితం విడుదలైన అతని ‘రెబల్’ సినిమాను ఇప్పుడు నట్టి కుమార్ అక్టోబర్ 15న రీ-రిలీజ్ చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగానూ ధనుష్ నటించిన అనువాద చిత్రం ‘త్రీ’ని నట్టికుమార్ రీ-రిలీజ్ చేశారు.
Read Also: Master Movie: పాతికేళ్ళ ‘మాస్టర్’!
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘రెబల్’లో ప్రభాస్ సరసన తమన్నా నటించగా, కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా అప్పట్లో భగవాన్, పుల్లారావు నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను మెప్పించడంలో అప్పుడు విఫలమైంది. మరి అదే సినిమాను ఇప్పుడు నట్టి కుమార్… ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీ-రిలీజ్ కు ప్లాన్ చేయడం చిత్రమే!
Read Also: Sara Arjun: సారా అర్జున్‌కు స్టార్ డమ్ దక్కుతుందా?