Ponniyin Selvan: ఏంటీ.. మూడురోజుల్లో రూ.200 కోట్లు సాధించిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొంది. కొంతమంది సినిమాను అస్సలు బాగాలేదు అంటుంటే.. మరికొంతమంది పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఇది తమిళ్ తంబీలు మాత్రం సూపర్ హిట్ అని, పెద్ద కళాఖండం అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం కష్టపడిన తీరు కనిపిస్తున్నా మణిరత్నం స్టైల్ అయితే లేదని చెప్పుకొస్తున్నారు. చిన్న చిన్న పాత్రలకు కూడా భారీ తారాగణాన్ని తీసుకొని తప్పు చేసారని మరికొందరు భావిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం ఏంటంటే.. ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టడం.. ఏంటి నిజమా అంటే.. అవును ఈ మార్క్ ను అందుకున్నదని మేకర్స్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు సాధించిందని చెప్పుకొచ్చారు. ఇక చెప్పాలంటే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ.25.86కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5.93కోట్లు, కర్ణాటకలో రూ.5కోట్లు, కేరళలో రూ.3.7కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35కోట్లకు పైగా ఉన్నాయి. ఆ తరువాత వీకెండ్ రావడం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ రెండు రోజులు ఈ సినిమా బాగానే రాబట్టింది చెప్పుకొస్తున్నారు. ఇక మరోపక్క సినిమా కథను తెలుసుకోవడానికి కన్నా విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిమానులు వారిని చూడడానికి సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని రూ.200 కోట్లు రాబట్టిందంటే నోర్లు వెళ్లబెడుతున్నారు నెటిజన్లు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!