Prabhas: ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. హాజరుకానున్న హీరో ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ ఎర్రకోటలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరుగనున్న రావణదహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రభాస్ కు విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్న లవకుశ రామ్ లీలా కమిటీ ఆహ్వానం పంపింది. గడిచిన రెండేళ్ల కాలంలో కరోనా వల్ల ఉత్సవాలను నిర్వహించలేకపోయిన నిర్వహకులు…ఈ సారి భారీ ఎత్తున్న ప్రణాళికలు రచించింది. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో అయోధ్యలోని రామాలయం నిర్మాణంలోని పండల్ను వేదికగా తీర్చిదిద్దారు. రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రావాణసురుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్ల బొమ్మలను ప్రభాస్ దహనం చేయనున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగలేదు. కరోనా విస్తృతి భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది రావణ దహన వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని రామ్ లీలా కమిటీ తీర్మానించింది. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు అందిన ఆహ్వానం మేరకు రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ప్రభాస్ ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
Read Also: PM Narendra Modi: జెలెన్స్కీకి ఫోన్.. సైనిక చర్యతో సంక్షోభాన్ని పరిష్కలేరంటూ సూచన
అయితే ఆదిపురుష్ చిత్రంపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అందులో రావణ, హనుమాన్ పాత్రలు కనిపించిన తీరుపై చాలామంతి తప్పుపడుతున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మిలిటరీ క్రాఫుతో, పొడవైన గడ్డంతో విచిత్రంగా కనిపించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హనుమంతుడు కూడా ఇంగ్లీషు సినిమాల్లో కింగ్ కాంగ్ లా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడి వేషధారణ అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో హనుమంతుడి వేషధారణ సరికాదని అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే ఆదిపురుష్ నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..