భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా అందించిన సేవకు గాను నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కేవలం అపూర్వమైన సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, అంకితభావం, క్రమశిక్షణ, మరియు సమాజానికి బాలయ్య చేస్తున్న సేవకు లభించిన నిదర్శనం. ఐదు దశాబ్దాల బాలయ్య అద్భుతమైన ప్రయాణానికి అద్దం పట్టే ఈ ప్రపంచస్థాయి గౌరవం కేవలం నందమూరి కుటుంబానికి కాదు తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆయన అభిమానులు మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య సినీ, రాజకీయ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Sandalwood : టాలీవుడ్ ను చూసి ట్రాక్ తప్పుతున్న శాండిల్ వుడ్
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ‘ బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేసారు. పవర్ స్టార్ చేసిన ఈ ట్వీట్ సొషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నందమూరి ఫ్యాన్స్ పవర్ స్టార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో…
— Pawan Kalyan (@PawanKalyan) August 25, 2025