ప్రముఖ నటి పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి పూర్ణ మాట్లాడుతూ, ”రిజ్వాన్ ఒక బ్యూటిఫుల్ స్టొరీతో ఈ మూవీ నిర్మించారు. నాతో ఈ సినిమాను తీసిన రిజ్వాన్, కళ్యాణ్ కి నా స్పెషల్ థ్యాంక్స్.
Read Also : ఆగస్టు 6న ‘మ్యాడ్’
16 సంవత్సరాల కెరీర్ లో ఇలాంటి పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఒక విలేజ్ డీసెంట్, ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఇందులోని ప్రధానాంశం. నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిల లైఫ్ లో జరుగుతున్న స్టోరీ ఇది. అర్జున్ తో యాక్ట్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను. క్లైమాక్స్ లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. రాకేందు మౌళి ఎక్సలెంట్ గా చేశాడు” అని అన్నారు. ఈ చిత్రానికి రాకేందు మౌళి పాటలు రాయగా, సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.