Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ హీరోయిన్ పూజ హెగ్డె పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు.. ‘బీస్ట్’ తో మొదలు ఇప్పటి వరకు వరుస సినిమాలు తీసినప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఐరన్‌లెడీ అనే ముద్ర కూడా పడిపోయింది. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అని ఇండస్ట్రీలో స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు ప్రజంట్ డిజాస్టర్ లో కూరుకుపోయింది. రీసెంట్‌గా ‘రెట్రో’ మూవీ మీద చాలా ఆశలు పెటుకున్నప్పటికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన పూజ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేసింది..
Also Read : 8 Vasantalu : ‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ సెకండ్ టీజర్ రిలీజ్..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘ఈ మధ్య కాలంలో నేను నటించిన ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘దేవా’ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. కొన్నేళ్లుగా నా కెరీర్ లో విజయం అనే పదానికి నిర్వచనమే మారిపోయింది. కానీ ఈ దశ నాకు చాలా ముఖ్యమైంది. ఇప్పుడు నా రాబోయే సినిమాలు.. భవిష్యత్తు ప్రాజెక్టులు, నేను ఎలాంటి నటిని అనే విషయాన్ని ప్రేక్షకులకు మరోసారి చూపిస్తుందని ఆశిస్తున్నా. నిజం చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో నాలాంటి వాళ్లు చాలా మంది అవకాశాల కోసం చాలా కష్టపడాలి. ఎన్నో సవాళ్లు, అనుభవాలతో సినీరంగంలో ప్రస్తుతం నేను ఒక స్థాయిలో ఉన్నాను. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. పరాజయాలను కూడా స్వీకరించాలి. ఒక వేళ దాన్ని అంగీకరించకపోతే.. కొత్తగా ప్రేక్షకులకు ఏమి ఇవ్వలేము. అద్భుతమైన చిత్రం నిర్మాతలతో కలిసి పని చేయడం.. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలు ఎంపిక చేసుకోవడం.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే.. ప్రస్తుతం ఇదే నా లక్ష్యం. నా సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ విజయాలను మనసులో పెట్టుకోను. నేను నటించిన సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటా. కథలు, పాత్రలు ఎంచుకునే పద్ధతిని మార్చి. ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది పూజ.
- Tags
- Jana Nayagan
- Pooja Hegde
- vijay
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?