Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde: సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ లుక్స్ ఉంటే చాలు బుట్టబొమ్మ పూజా హెగ్డే పడిపోతుంది అనుకుంటే కుర్రాళ్లు తప్పులో కాలేసినట్లే. ఆమె మనసు గెలవాలంటే అబ్బాయిల్లో అసలు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటో దర్శకుడు హరీశ్ శంకర్ బయటపెట్టారు. ఒక టాక్ షోలో సరదాగా ముచ్చటిస్తూ పూజా హెగ్డేకు కాబోయే తోడు ఎలా ఉండాలో ఆమె చెప్పిన సీక్రెట్‌ను ఆయన రివీల్ చేశారు. నేటి తరం యూత్ అంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోన్ స్క్రీన్లలో మునిగితేలుతుంటే.. పూజా మాత్రం ఖాళీ దొరికితే చాలు చేతిలో పుస్తకం పట్టుకుని కనిపిస్తుందట. అంతేకాదు, మంచి పుస్తకాలను హరీశ్ శంకర్‌కు కూడా పంపించి చదవమని రికమండ్ చేసేదట. ఎప్పుడూ పుస్తకాలతోనే సమయం గడపడం చూసి.. “అసలు నువ్వు పుస్తకాలు ఎందుకు ఇంతలా చదువుతావు?” అని హరీశ్ సరదాగా ప్రశ్నించారట.

దానికి పూజా ఇచ్చిన సమాధానం విని హరీశ్ శంకర్ షాక్ అయ్యారు. “నేను మగాడిలో కేవలం పైపై అందాన్ని, లుక్స్‌ను చూసి అస్సలు పడను.. అతని ఆలోచనా తీరు, ఇంటెలెక్ట్ (మేధస్సు) నచ్చితేనే ఇంప్రెస్ అవుతాను” అని మొహం మీదే చెప్పేసిందట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. “పూజా నోటి నుంచి ఆ మాట విన్నాక, ఏ కుర్రాడికైనా జిమ్‌కి వెళ్లి కండలు పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి?” అంటూ హరీశ్ శంకర్ సరదా పంచ్ వేశారు. మొత్తానికి బుట్టబొమ్మ మనసు గెలవాలంటే అందం, కండల కంటే కూడా కాస్త బుర్ర, ఆలోచనా విధానం ఉండాల్సిందేనని తేలిపోయింది. దీంతో పూజాను పడేయాలంటే కుర్రాళ్లు డంబల్స్ పక్కనపెట్టి చేతికి పుస్తకాలు తీసుకోవాల్సిందే అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.