స్టార్ హీరోయిన్ పూజా హెగ్డె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో పరిచయం అయిన ఈ అమ్మడు అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్క్ చూపించింది. కానీ ఎంత త్వరగా ఫేమ్ వచ్చిందో, అంతే త్వరగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొంత నిరాశే చవిచూసింది. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read: Siddu Jonnalagadda : వైష్ణవి చైతన్యలో నాకు నచ్చిన విషయం అదే
పూజ మాట్లాడుతూ.. ‘చాలా వరకు దర్శక నిర్మాతలు ఈ పాత్రకి వారు సరిపోతారు అని.. వారికి వారే డిసైడ్ అయిపోతారు. నటీనటులపై త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్లను కనీసం ఆడిషన్ కూడా చేయకుండా సినిమాలోకి తీసుకుంటారు. కానీ ప్రతి సినిమాకు ఆడిషన్ ముఖ్యం. ఈ పద్ధతి కొన్ని ఇండస్ట్రీలో మాత్రమే ఉంది’ అని చెప్పుకొచ్చింది. అయితే పూజ ఇలా మాట్లాడటానికి కారణం ఉంది. ఇటీవల ఈ అమ్మడు ఓ తమిళ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లిందట. ఆ పాత్రకు తన వయసు తక్కువ అని భావించి నో చెప్పారట. ఆ తర్వాత తన కంటే వయసు పెద్ద అయిన ఓ హీరోయిన్‌ని ఓకే చేశారట. అందుకే సినిమాలోకి తీసుకున్న తర్వాత ఆ పాత్రకు సరిపోలేదని తిరస్కరించే బదులు.. ఇలా ముందుగానే ఆడిషన్ చేయడం మంచిది అని చెబుతోంది పూజ.