Case Filed on Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్యల కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి, డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు దూరం పెట్టి, హీరోయిన్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ప్రస్తుతం నటి మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కాగా రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి మాల్వి మల్హోత్రా, ఆమె అన్న కారణం అని, కాల్స్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మీరే ఎలాగైనా తనకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్, మాల్విపై ఆమె ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు ఆధారాలు సమర్పించని లావణ్య తాజాగా అధరాలు సమర్పించగా ఇప్పుడు పోలీసు కేసు నమోదైంది.
లావణ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమెపై పలు ఆరోపణలు చేసాడు రాజ్ తరుణ్. లావణ్య గతంలో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పెళ్ళిచేసుకోవాలని అతనిపై కేసు పెట్టింది. ఆమె ప్రతీ రోజు డ్రగ్స్ తీసుకుంటుంది. అడ్డు చెప్పినందుకు తనను గొడవ పడింది. డ్రగ్స్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆమె అందరిని బ్లాక్ మెయిల్ చేస్తుందని అన్ని ఆధారాలతో లావణ్యపై కేసు పెడతానని తన వాదనను తెలియజేసాడు రాజ్ తరుణ్. కానీ లావణ్యపై ఎటువంటి కేసు పెట్టలేదు ఈ హీరో.
Also Read: Raviteja: సితార్ అంటూ వచ్చేసిన మాస్ మహారాజ్
కాగా పోలీసుల దర్యాప్తులో భాగంగా రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించమని లావణ్యను కోరగా నిన్న రాజ్ తరుణ్ కు సంబంధిచిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ ను పోలీసులకు సమర్పించింది లావణ్య. ఈ తరుణంలో నేడు నటి మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై కేసు పెటింది. తనసై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. నా సోదరుడుకి అనుచిత మెసేజ్ లు పంపుతోంది, కాల్ చేసి నోటికొచ్చినట్టు తిడుతోందని కేసులో పేర్కొంది. ఇలా ఇద్దరు హీరోయిన్లు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ కేసు వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. మల్హోత్రా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఇలా వాదోపవాదనలు, పరస్పరం కేసులతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.