Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. పుష్ప-2 టీమ్ కు భారీగా లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు.
Read Also: Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెన్ ఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణం అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని.. కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు చెప్పుకొచ్చారు. అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయిందిగా అని కోర్టు ప్రశ్నించగా.. దాని కోసమే ఇప్పుడు పిల్ వేసినట్టు నరసింహారావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు రెండు వారాల దాకా విచారణ వాయిదా వేసింది.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే పుష్ప-2 టీమ్ మొన్నటి దాకా సంధ్య థియేటర్ ఘటనతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఆ ఘటన నుంచి పూర్తిగా బయట పడనే లేదు. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడిప్పుడే పుష్ప-2 గురించి చర్చ జరగడం ఆగిపోతోంది. ఇలాంటి టైమ్ లో వాటాల గురించి పిల్ వేయడంతో మళ్లీ పుష్ప-2 గురించి మళ్లీ చర్చ మొదలవుతోంది. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏమైనా స్పందిస్తారో లేదో అనేది చూడాలి.
