టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత్తం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘మిరాయ్’ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. హిందీ లో ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది.
Also Read : Pawan Kalyan : OG ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్.. ఎన్ని మిలియన్స్ రాబడతాడో?
కాగా తేజ సజ్జా బర్త్ డే కానుకగా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న మిరాయ్ ని నిర్మిస్తోన్న పీపుల్ మీడియా తేజ సజ్జాతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. రాయాలసీమ వరల్డ్ అని ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పీపుల్ మీడియాతో చేస్తున్న సినిమా జంబిరెడ్డి సినిమాకు సీక్వెల్ అని తెలిసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 2021 లో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుండి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబో సూపర్ హిట్ కాంబోగా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా జాంబి రెడ్డి సీక్వెల్ ను తీసుకురాతున్నారు. ఈ సీక్వెల్ ను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ మాత్రమే ఇస్తాడని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.