PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
- జోరుగా రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్
- ముంబై ఈవెంట్లో ట్రైలర్ లాంచ్
- దసరా మైదాన్‌లో 'పెద్ది' దిగుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan’s PEDDI Ki Aawaz Event at Bhopal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేయగా.. బ్యాట్ పట్టుకొని చరణ్ చేసిన రచ్చ సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానుల కోసం మరో భారీ ఈవెంట్‌ను ప్రకటించింది. ‘#PEDDIKiAawaz’ పేరుతో నిర్వహించనున్న ఈ స్పెషల్ ఈవెంట్ మే 23న భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా మైదాన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన చరణ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు పెద్ది చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. ఈ అద్భుతమైన మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను లైవ్‌లో చూసేందుకు భోపాల్ సిద్ధంగా ఉండాలంటూ.. చరణ్ తెలిపారు. పెద్ది స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్, చరణ్ అదిరిపోయే స్టెప్పులేసినట్టుగా తెలిసింది. ఈ పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించనుంది. రెహమాన్ ఇచ్చిన మాస్ బీట్‌కు థియేటర్ టాపులు లేచిపోవడం గ్యారెంటీ అంటున్నారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెహమాన్ సంగీతం, లైవ్ షో ఈ ఈవెంట్‌కు మరింత హైలైట్ కానున్నాయి.
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘PEDDIKiAawaz’ ఈవెంట్‌తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి అభిమానుల అంచనాలను పెద్ది అందుకుంటుందో లేదో. ‘గేమ్ ఛేంజర్’తో భారీ ఫ్లాఫ్ ఖాతాలో వేసుకున్న చరణ్.. పెద్ది పైనే ఆశలు పెట్టుకున్నాడు.
BHOPAL, get ready for #PEDDIKiAawaz, an unforgettable event 💥💥
At BHEL Dusshera Maidan,
23rd May, 5:00 PM Onwards ❤️🔥With @arrahman Live performance and also Special song launch ❤️🔥❤️🔥#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/69eZjXmLbU
— PEDDI (@PeddiMovieOffl) May 21, 2026
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!