మొదటి చిత్రంతోనే గుర్తింపు సంపాదించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ కొంత మంది హీరోయిన్‌లు మాత్రం ఊహించని విధంగా ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన ఈ అమ్మడు.. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్ని.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ హీరోగా వచ్చిన ఈ చిత్రంతో పాయల్ యాక్టింగ్‌కి వంద వంద మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా.. ఈమెకు సరైన హిట్ దక్కలేదు. రవితేజ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా పాయల్ కెరీర్‌కు ప్లేస్ అవ్వలేదు. కానీ చివరగా ‘మంగళవారం’ మూవీతో ఒక్కసారిగి మరింత పాపులారిటి దక్కించుకుంది. ఇక పాయల్ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే..
Also Read: Taapsee : ఇలాంటి ఓ రోజు వస్తుందని నాకు ముందే తెలుసు..
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఏకంగా తన ఫోన్ నెంబర్‌ని షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఫోన్ నెంబర్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే.. పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో ఓ పెట్ ఉంటుందట.. ఇప్పుడు దానికి ఇంకో ఐదు పిల్లలు పుట్టాయని పోస్ట్ చేసింది. వీటన్నంటికి సపరేట్‌గా ఓ షెల్టర్ చూస్తున్నానని.. పెట్స్ కోసం చూస్తున్నవారు .. పెట్స్‌కి మంచి స్పోర్ట్ ఇస్తూ షెల్టర్ ఇవ్వగలిగే వారు ఆమెని సంప్రదించాలని ఆ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసినట్లు ఆమె టీం వివరించారు. ఎంతైనా ఇది పెద్ద సాహసం అనే చెప్పాలి.