టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి మోడల్‌గా కెరియర్ ప్రారంభించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ తో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ అందరిని మెప్పించి తన అంద చందాలతో ప్రేక్షకులన్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ పాపులర్టీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ‘పింక్’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘మన్మర్జియన్’ వంటి సినిమాల్లో నటించి, బాలీవుడ్‌లో మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయిన తాప్సీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..
అయితే ప్రజెంట్ సోషల్ మీడియా కారణంగా బయట ప్రపంచం ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. లైక్ .. షేర్.. అంటూ సగం జీవితం అందులోనే గడుపుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై తాప్సీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్ మీడియా పై ప్రతి ఒక్కరికి ఉన్న వ్యామోహం చూసి ఇలాంటి రోజు వస్తుందని భయపడుతూనే ఉన్న. జీవితాన్ని మనం ప్రేమించడం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని.. చుట్టూ ఉన్నవారు చూపించే నిజమైన ప్రేమ కంటే, ఆన్లైన్ ప్రేమకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామని భయపడ్డా. అంతే కాదు మనం కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు చదువుకున్న డిగ్రీలను లైకులు, కామెంట్స్ అధిగమిస్తాయని కూడా ఊహించా. ఇప్పుడు నేను భయపడి నట్లుగానే జరిగింది. ఈరోజు ఇలాంటి ఘటనను చూడటం నిజంగా బాధగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా హృదయం ముక్కలైంది’ అని తాప్సీ పోస్ట్ పెట్టారు.