పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ‘హరి హర వీరమల్లు’ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి.
Also Read : HHVM : ‘హరిహర’ మీడియా మీట్.. ‘వీరమల్లు’ చెప్పింది వినాలి
కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. హరిహర వీరమల్లు ను తన వంతు భాద్యతగా తీసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు మీడియాతో ముచ్చటించబోతున్నారు పవన్. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ తో పాటు ఇరు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా హాజరుకానున్నారు. అలాగే 22న మంగళగిరిలో అక్కడి మీడియాతో సమవేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23న విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇలా వరుస ప్రెస్ మీట్స్ తో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో రాజకీయంగా బిజీగా ఉంటూనే తన భాద్యతగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.