తెలంగాణలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాకి సంబంధించి రేట్లు పెంపు GO తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ సస్పెండ్ చేసిన జీవోని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటివరకు పెంచిన రేట్ల విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే, కావాలంటే పిటిషనర్ నైజాం ప్రాంతం గురించి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి, ఆయన సినిమా చూస్తానంటే డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థకు సూచించింది.
Also Read : R.S. Brothers : 15వ షోరూమ్ హైదరాబాద్ వనస్థలిపురంలో శుభారంభం
ఈ నేపథ్యంలో, నిర్మాణ సంస్థ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ మేరకు సూచనలు చేసింది కాబట్టి, సాధారణ పిటిషనర్‌కి 100 రూపాయల డిస్కౌంట్, నైజాం ప్రాంతంలో ఎక్కడ సినిమా చూసినా కల్పిస్తామని చెప్పుకొచ్చింది. ఇక, ఓజి సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ మీద డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి మొదటి రోజే 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.