పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ అందరూ ‘వకీల్ సాబ్’ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు పవన్ తాను రానాతో కలిసి నటించబోయే చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. పవన్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో తిరిగి పాల్గొంటారు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా పిఎస్పికె 28 త్వరలో ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.