పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం కలిసి.. ‘ఓజీ’ని హాలీవుడ్ స్థాయి చిత్రంగా నిలిపాయి. ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందుతూ భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం నిలిచింది.
Also Read : NBK111 : బాలయ్య – గోపీచంద్ సినిమాకు కాంతార కెమెరామెన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ఈ సినిమా సక్సెస్ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడేలా చేశాడు సుజీత్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు పవర్ స్టార్ ని మనం ఎలా చూడాలి అనుకుంటున్నామో, అలాంటి లుక్ లో చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూశారు. సెప్టెంబర్ 24 రాత్రి సుదర్శన్ థియేటర్ లోనే నేను కూడా సినిమా చూడటం జరిగింది. పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో నాకు తొలిప్రేమ సినిమా నుంచి తెలుసు. ఐతే ఇలాంటి ఒక సినిమాని రాసి, పవన్ కళ్యాణ్ ను ఒప్పించినందుకు సుజిత్ కి చాలా థాంక్స్. అలాగే, ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చినందుకు తమన్ కి కూడా చాలా థాంక్స్. చివరిగా ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నా ఏడాదికి ఒకసారి ఓజీ లాంటి సినిమా తీయాలి. అలా చేస్తే సంతోషిస్తాం” అని అన్నారు.