Site icon NTV Telugu

Defence Forces In KBC 17: కేబీసీ 17 వేదికపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో అమితాబ్ బచ్చన్

Amithab Bachan

Amithab Bachan

Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు. ఈ ఎపిసోడ్‌లో కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్), కమాండర్ ప్రేరణ దియోస్థలీ (ఇండియన్ నేవీ) హాట్‌సీట్లో కూర్చొని అమితాబ్‌తో ప్రత్యేక సంభాషణ జరిపారు. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ తమ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ లో ఓ క్లిప్‌ను షేర్ చేసింది.

Read Also: MP Avinash Reddy: రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నాం.. అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్

అయితే, ఆ ప్రోమోలో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తునే ఉంటుంది.. అందుకే ఆపరేషన్ సిందూర్ ప్లాన్ చేసి.. దాని వల్ల గట్టిగా సమాధానం ఇచ్చాం అని చెప్పారు. ఇక, వింగ్ కమాండర్ వ్యోమికా మాట్లాడుతూ.. రాత్రి 1:05 నుంచి 1:30 వరకు కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ ముగించాం అని వివరించారు. అలాగే, కమాండర్ ప్రేరణ మాట్లాడుతూ.. టార్గెట్లను విజయవంతంగా ధ్వంసం చేశాం, కానీ ఏ ఒక్క పౌరుడికి హానికలుగలేదని వెల్లడించింది. ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది టెర్రర్ క్యాంపులపైనే దాడులు చేశామని పేర్కొన్నారు.

Read Also: Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత..

ఇక, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో 22మంది పౌరులను ఉగ్రవాదులు కాల్పి చంపేయడానికి ప్రతీకారంగా చేపట్టిన ఘటన అని పేర్కొన్నారు. కాగా, కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. ఇది కొత్త ఆలోచనలతో కూడిన భారతదేశం అని చెప్పగా, ఆడియన్స్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ “భారత్ మాతా కి జై” అని నినాదాలతో ప్రోమో ముగిసింది. అయితే, కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో ప్రసారం అవుతుంది.

Exit mobile version