Park Hyatt : పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం: ఓదెల 2 ఈవెంట్‌కి ఇబ్బందేం లేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్లో సోమవారం (ఏప్రిల్ 14, 2025) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు హోటల్‌ను ఆవరించాయి. ఈ ఘటనతో హోటల్లో ఉన్నవారిలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ హోటల్లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ టీమ్ ఆటగాళ్లు బస చేస్తున్నారనే విషయం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను జోడించింది. అయితే, అగ్నిప్రమాదం సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. SRH టీమ్ ఆటగాళ్లు ఈ ఘటన తర్వాత కూడా తమ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు.
Tu Mera Lover: చక్రి ఏఐ వాయిస్ తో రవితేజ సాంగ్ .. భలే ఉందే!
Also Read
- Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ - బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
- Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ 'డైమండ్ ఇయర్ రింగ్స్' కొట్టేశారు
- ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
- Maa Inti Bangaram : 'మా ఇంటి బంగారం' రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
ఓదెల 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ఉండదా?
అదే హోటల్లో సోమవారం సాయంత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అశోక్ తేజ దర్శకత్వంలో, సంపత్ నంది రచనలో తెరకెక్కిన ఈ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ ఏప్రిల్ 17, 2025న విడుదల కానుంది. తమన్నా శివశక్తి అనే నాగసాధ్వి పాత్రలో కనిపించనుంది, ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం హోటల్లో భారీ ఏర్పాట్లు జరిగాయి, మరియు అగ్నిప్రమాదం ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే ఈ ప్రమాదం ఉదయమే జరిగిందని, మీడియాకు సమాచారం మధ్యాహ్నం తరువాత జరిగిందని వెల్లడించారు. ఎలాంటి ఢోకా లేకుండా సాయంత్రం ఈవెంట్ జరగనుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్‌పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
-
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
-
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!