బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. మొదట జూలైలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన ప్రకారం..
Also Read : Supriya Menon: ఏడేళ్ల వేధింపుల పై.. మౌనం వీడిన స్టార్ హీరో పృథ్వీరాజ్ భార్య
ఈ మూవీని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రం సౌత్ ఇండియా – నార్త్ ఇండియా కలయికలో రాబోతున్న ప్రేమకథగా రూపొందింది. జాన్వీ కపూర్ గ్లామర్ లుక్, సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కొత్తగా ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలి’ లాంటి పాత్రలతో ఇమేజ్ మార్చుకున్న జాన్వీ, ఈ సినిమాతో మరింత బలమైన పాత్ర పోషించిందని సమాచారం. సోషల్ మీడియాలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇటు సౌత్, ఉత్తరాదిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జాన్వీకి ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవొచ్చని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.