సోషల్ మీడియాలో వేధింపులు కామన్. ముఖ్యంగా నటీనటులకు విషయంలో ఇలాంటి అనుభవాలు రోజుకొకటి ఎదురుకుంటారు. ఇందులో భాగంగా తాజాగా స్టార్ హీరోయిన్ భార్య కూడా ఇలాంటి వేధింపులు ఎదురుకున్నట్లు తెలిపింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మేనన్.
Also Read : Nagarjuna: ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున..
మేనన్ సోషల్ మీడియాలో ఏడేళ్లుగా కొనసాగుతున్న వేధింపులపై నోరు విప్పారు.. ‘2018 నుంచి ఓ మహిళ నను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తూ, అసభ్యకరమైన కామెంట్లు చేస్తుంది’ అని సుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోను పంచుకున్న సుప్రియ ఇన్‌స్టాలోని ఏ ఫిల్టర్ కూడా తనపై ఆమెకున్న ద్వేషాన్ని కప్పిపుచ్చలేకపోతోందని పేర్కొన్నారు. ‘‘2018 నుంచి ఆమె నాకు తెలుసు. ఆమెకు చిన్న పిల్లాడు ఉన్న కారణంగా నేను ఇన్ని రోజులు ఆమెపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నా తండ్రిపై కూడా నిందలు వేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఆయన ప్రస్తుతం మా మధ్య లేకపోయినప్పటికీ నిందలు వేస్తోంది. నేను ఎన్నోసార్లు ఆమె ఖాతాను బ్లాక్ చేశాను. అయినా ఫేక్ ఏకౌంట్ క్రియేట్ చేసి మరి కామెంట్స్ చేస్తోంది. నన్ను బాధపెట్టడమే ఆమె పనిగా పెట్టుకుంది. ఆమె క్రియేట్ చేసుకున్న ప్రతి ఖాతాను బ్లాక్ చేయడం నాకు రోజు వారి పని గా మారిపోయింది’ అంటూ సుప్రియ తన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.