పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. రాబోయే మోస్ట్ యాంటిసిపెటెడ్ చిత్రాల బడ్జెట్ చూస్తే నిజమనిపించకమానదు. మాగ్నప్ ఓపస్ మూవీస్‌గా రూపుదిద్దుకుంటున్న వాటి నిర్మాణ వ్యయం తెలిస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే.
Also Read:MSRTC: మద్యం మత్తులో డ్రైవర్, కండక్టర్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ మూవీ కల్కి 2898ఏడీనే దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం. రూ. 600 కోట్లతో తెరకెక్కించిన మూవీ.. డబుల్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రికార్డును చెరిపేసేందుకు రెడీ అయ్యాయి అట్లీ- బన్నీ ఫిల్మ్,ఎస్ఎస్ఎంబీ29, రామాయణ. పుష్ప2తో ఇండియా బాక్సాఫీసును రూల్ చేశాడు బన్నీ. దీంతో ఐకాన్ స్టార్ రేంజ్ పెరిగింది. నెక్ట్స్ ఆ రేంజ్‌కు తగ్గట్టుగానే సినిమాను సిద్దం చేశాడు. పాన్ ఇండియా ఫిల్మ్ అనుభవం లేని త్రివిక్రమ్‌ను పక్కన బెట్టి.. జవాన్‌తో బీటౌన్‌కు కలెక్షన్స్ అంటే ఇవి రుచి చూపించిన అట్లీతో బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాడు. ఈ క్రేజీ కాంబోకి ఫిదా అయిన సన్ పిక్చర్స్ రూ. 800- 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
రాజమౌళి క్రియేట్ చేసిన బ్రాండ్ వేరే లెవల్. హీరోలతో సంబంధం లేకుండా దర్శక ధీరుడు చెక్కే కళాఖండంపై ఎంతైనా ఇన్వెస్ట్ మెంట్ చేయోచ్చని పోటీ పడుతున్నారు నిర్మాతలు. అందులోనూ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోతో కాంబో సెట్ చేస్తే కోట్లు కుమ్మరించాల్సిందే. ఎస్ఎస్ఎంబీ29పై వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెడుతోంది శ్రీ దుర్గా ఆర్ట్స్. ఇప్పటి వరకు 500 కోట్లు క్రాస్ చేయని మహీ.. పాన్ ఇండియా ఫిల్మ్‌తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వీటిని మించిపోయింది బాలీవుడ్ ఫిల్మ్ రామాయణ. సుమారు 1600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు నమిత్ మల్హోత్రా. అయితే ఇది టూ పార్ట్స్‌కు కలిపి ఇంత బడ్జెట్ అవుతుందని టాక్.
Also Read:Telangana Murder: దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించిన అల్లుడు
బడ్జెట్ కోట్లు దాటడానికి మెయిన్ రీజన్స్.. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ వీఎఫ్ఎక్స్. ఈ రెండింటికీ అత్యధిక భాగం ఖర్చుఅవుతోంది. వీటికి తోడు విదేశాల్లో షూటింగ్, స్పెషల్ సెట్స్ అంటూ క్రోర్స్ కుమ్మరిస్తున్నారు. ఓటీటీ సంస్థలను ఆకర్షించేందుకు కూడా ఈ బడ్జెట్ వర్క్ అవుతోంది. ఆడియన్స్‌కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ వ్యయాన్ని పెట్టడంలో తప్పులేదు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. పెట్టిన ఖర్చుకు రెండింతలు వస్తే ఓకే.. కానీ అదే రిజల్ట్ తిరగబడితే.. ప్రొడ్యూసర్.. నెక్ట్స్ సినిమా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఆదిపురుష్, కంగువా, గేమ్ ఛేంజర్ రిజల్ట్ దెబ్బకు నిర్మాణ సంస్థలు ఎంత కుదేలయ్యాయో అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన పనేముంది?
