పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు…