Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pa.Ranjith: రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా ప్రముఖ తమిళ దర్శకుడు పా.రంజిత్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మన రాజ్యాంగం విలువ ఏంటో గుర్తుచేస్తూనే, నేటి సమాజంలో జరుగుతున్న వివక్షలపై ఆయన సూటిగా స్పందించారు. భారత రాజ్యాంగం అంటే ఏదో కొన్ని చట్టాలు, రూల్స్ రాసి ఉన్న పుస్తకం మాత్రమే కాదని పా.రంజిత్ అన్నారు. తమ హక్కుల కోసం నిలబడే అణగారిన వర్గాల గొంతుక అది అని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించిన అసలైన పునాది అని ఆయన రాసుకొచ్చారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి రాజ్యాంగమే రక్షణ కవచమని చెప్పారు. ఏదో ఒక్క రోజు రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని మాట చెబితే సరిపోదని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోరుకున్నట్లుగా ప్రతిరోజూ రాజ్యాంగ విలువలను పాటిస్తూ దాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ కులం, మతం, భాష, లింగం, ఆర్థిక స్థాయి లాంటి ఎలాంటి భేదాలు లేకుండా ఆత్మగౌరవంతో, సమానత్వంతో బతికే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పటికీ సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, మత విద్వేషాలు, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు మన ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలుగా మారాయని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ మహా గ్రంథం చరిత్రలో నిలిచిపోయేదని పా.రంజిత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ మనకు దారి చూపిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయం, సోదరభావం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి విలువలను కాపాడుకుంటూ.. వాటికి వ్యతిరేకంగా జరిగే ప్రతి వివక్షను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కోవాలని ‘జై భీమ్’ నినాదంతో ఆయన తన పోస్ట్‌ను ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
- Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
- Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
- Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
తాజావార్తలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
-
Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
-
IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!