పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు. అతని అభిమానులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే వార్త. అయితే… మరో సెన్సేషనల్ న్యూస్ కూడా వాళ్లకు ఆనందాన్ని అందిస్తోంది. అదేమిటంటే… ముంబై బేస్డ్ పాపులర్ మీడియా ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా ఇటీవల ‘మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మొదటి స్థానం దక్కింది. సెకండ్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. విశేషం ఏమంటే… ఇంతవరకూ పాన్ ఇండియా జోలికి పోకుండానే మహేశ్ బాబు ఈ చోటు దక్కించుకున్నాడు.
గత యేడాది ఇదే జాబితాలో బన్నీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, మహేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు వీరి స్థానాలు అటూ ఇటూ అయ్యాయి. ఇక మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండగా, ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నాని, చిరంజీవి, రవితేజ మిగిలిన తొలి పది స్థానాల్లో వరుసగా నిలిచారు. సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవికి తప్పితే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు చోటు దక్కలేదు. విశేషం ఏమంటే… ఈ జాబితాలోని పది మంది కూడా ఇప్పుడు చేతినిండా సినిమాలతో యమ బిజీగా ఉన్నారు. బన్నీ ‘పుష్ప’ మూవీతో బిజీగా ఉంటే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏకంగా మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’లోనూ, చెర్రీ ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆచార్య’ షూటింగ్ లోనూ ఉన్నాడు. విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు. నాని ‘టక్ జగదీశ్’ అతి త్వరలో జనం ముందుకు రాబోతుండగా, ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ‘ఆచార్య’ మూవీ చేస్తుంటే, రవితేజ ‘ఖిలాడీ’ని పూర్తి చేసి ‘రామారావు’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
Read Also : పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!
చిత్రమేమంటే ‘నారప్ప’తో పాటు ‘దృశ్యం -2’ సినిమా చేసిన వెంకటేశ్ కు గానీ, ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’లో నటించి, ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్న నాగార్జునకు కానీ, ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ’ను చేస్తున్న బాలకృష్ణకు కానీ టాప్ టెన్ జాబితాలో చోటు దక్కలేదు. పైగా సోషల్ మీడియాలో హల్చల్ చేసే యంగ్ హీరోలకు దక్కిన స్థానాలపైనా చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్మాక్స్ మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సినిమా, టీవీ, ఓటీటీ, న్యూస్, మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ లో ట్రాకింగ్, టెస్టింగ్, ఫోర్ కాస్టింగ్ లను ఎనలైజ్ చేసే కన్సల్టెన్సీగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపే ఉంది.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!