Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరంటే?
- భారత చలనచిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టు
- ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్య ఆధారంగా సినిమా
- ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగాలతో కలిసి విస్తృత స్థాయిలో గ్రౌండ్ రీసెర్చ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించనుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుగా ఈ మూవీ రానుంది. 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన సైనిక చర్యలే ఈ చిత్రానికి నేపథ్యం. భారత సైన్యం చేసిన సాహసాలను ఈ సినిమాలో చూపించనున్నారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan) పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. 2025 మే 6 నుంచి 10 మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న వ్యూహాలు, సంఘటనలను పుస్తకంలో వివరంగా రాశారు. ఆ వివరాలను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి. స్టార్ కాస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
Also Read: CSK Opening Pair 2026: సీఎస్కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్ మాత్రే అవుట్!
ఈ ప్రాజెక్ట్ గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ… ‘నిజానికి దగ్గరగా ఉండే కథలను చెప్పడంలోనే నాకు ఆసక్తి ఉంటుంది. ధైర్యం, ప్రొఫెషనలిజం, వ్యూహాత్మక స్పష్టతను ప్రతిబింబించే ఈ కథను నిజాయితీగా, థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించేలా తెరకెక్కించాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగాలతో కలిసి విస్తృత స్థాయిలో గ్రౌండ్ రీసెర్చ్ చేశాను. ప్రజలకు తెలిసిన దానికంటే ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైనది’ పేర్కొన్నారు. వివేక్ ఇప్పటికే సామాజిక-రాజకీయ అంశాలపై సినిమాలు తీసి గుర్తింపు పొందారు. ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈసారి కూడా దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాకు ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు ‘మిషన్ సిందూర్’, ‘హిందుస్తాన్ కా సిందూర్’, ‘సిందూర్ కా బద్లా’, ‘సిందూర్: ది రివెంజ్’ వంటి పలు టైటిల్స్‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత్ సైనిక శక్తి, ఉగ్రవాదంపై పోరాటం, దేశభక్తి భావాలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!