హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ వుంటారు.అది కూడా హారర్ తో పాటు కామెడీ కూడా ఉంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తుంటారు. హారర్ కామెడీ ఫార్ములాతో చాలా సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.తాజాగా ఇదే ఫార్ములాతో మరో మూవీ రాబోతుంది.ఆ సినిమానే OMG (ఓ మంచి ఘోస్ట్)..మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్ మరియు నటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. డా.అబినికా ఇనాబతుని ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అలాగే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. తాజాగా వదిలిన గ్లింప్స్ మరియు కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమా థీమ్ ఎలా ఉంటుందనే విషయాన్నిమేకర్స్ స్పష్టం చేశారు.అలాగే తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని మేకర్స్ ఎంతో ధీమాగా చెబుతున్నారు.ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే భయపెట్టిస్తుందని మేకర్స్ తెలిపారు.త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.