పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సుజిత్ దర్శకత్వంలోని ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ బోయపాటి అఖండ సెకండ్ పార్ట్ సినిమా ఇప్పటివరకు అయితే ఒకే రోజు రిలీజ్ కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి.
Also Read:Kubera: ‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!!
అయితే దాదాపుగా అది అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రెండు సినిమాల మధ్య క్లాష్ జరిగితే, నైజాం బిజినెస్ సెటప్ ప్రకారం హైదరాబాద్ సిటీ ఒక్కదానిలోనే 1500 షోల వరకు వేయాల్సి ఉంటుంది. అందులో 1200 షోలు ఓజీకి, అఖండకు 300 వరకు సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించవచ్చు. అయితే ఇది దాదాపుగా అసాధ్యం అని చెప్పాలి. ఎందుకంటే అఖండ 2 సినిమా మొత్తం సీజీ వర్క్ చుట్టూ తిరుగుతోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఇప్పటికీ చాలా పెండింగ్ ఉంది. కాబట్టి సెప్టెంబర్ 25వ తేదీన వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని అంటున్నారు.
Also Read:Ponnam Prabhakar : బోనాలకు వేళాయే.. జూన్ 26న తొలి బోనం
అదే జరిగితే ఎక్కువగా అఖండ 2 సినిమా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ కాకుండా డిసెంబర్ డేట్ ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు మేకర్స్. అఖండ మొదటి భాగం డిసెంబర్ రెండు 2021లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ రెండవ భాగం డిసెంబర్ 4, 2025ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. అయితే ఒకవేళ అఖండ వర్క్ పూర్తయితే కూడా సెప్టెంబర్ డేట్ వదిలేస్తారా అనేది అనుమానమే. మరి చూడాలి చివరికి ఏం జరగబోతోంది అనేది.