Site icon NTV Telugu

Prasad IMAX: ఓజికి వచ్చేప్పుడు ఎక్స్ట్రా టీ షర్ట్ తీసుకు రండి

Og

Og

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. అన్ని మాల్స్‌లో, థియేటర్స్‌లో ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సంస్థ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. సాధారణంగా సినిమాలను సెలెబ్రేట్ చేసుకునే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, అయితే ఓజీ విషయంలో హద్దులు కాస్త దాటుతున్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు వస్తున్న కిక్ తట్టుకునేందుకు కొంతమంది తాము ధరించిన టీ షర్ట్‌లు చింపేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Also Read: SS Thaman: ఓజీ సినిమా మాది కాదు, ప్రజలది!

మీ ఆంగ్సైటీ మేము అర్థం చేసుకోగలం, కానీ ఇతర ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, దయచేసి ఎక్స్ట్రా టీ షర్ట్ క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఆ నోట్‌లో పేర్కొంది. ఒకవేళ వేసుకున్న చొక్కా చింపేసినా, పట్టుకొచ్చిన చొక్కా ధరించి బయటికి వెళ్లాలని సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు.

Exit mobile version