SS Thaman: ఓజీ సినిమా మాది కాదు, ప్రజలది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టగా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది.
Also Read:Danayya : ఓజీ టైటిల్ నాగవంశీదే.. ఇచ్చినందుకు థాంక్స్!
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్ లో మరింత బాధ్యతగా పని చేస్తాం. ఓజీ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్ నా సోదరుడు లాంటివాడు. రెండేళ్లు కలిసి ప్రయాణం చేశాం. కథ విన్నప్పుడే.. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి కథలో, ఈ తరహా పాత్రలో చూడాలనేది నాలాంటి ఎందరికో డ్రీమ్. ఓజీ సినిమాతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ముందుగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కారకులైన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పని చేయడం అనేది డ్రీమ్. నాకు త్రివిక్రమ్ గారితో పని చేయడానికి వంద సినిమాలు పట్టింది. అలాగే పవన్ గారితో పని చేయడానికి కూడా వంద సినిమాలు పట్టింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు పని చేసే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు.
Also Read:Sujeeth: పవన్ ని కలిస్తే చాలు అనుకునే నేను ఆయనతో బ్లాక్ బస్టర్ కొట్టా!
నటుడిగా ఆయనను అభిమానిస్తాను, నాయకుడిగా గౌరవిస్తాను. ఆయన 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యి ఎంత హై ఇచ్చారో.. ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము. రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము. మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను. నీ వెనుక మేమున్నాం అంటూ దానయ్య గారు, కళ్యాణ్ గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నవీన్ నూలిది, నాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. నవీన్ ఈ సినిమాకి పని చేయడం అదనపు బలం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది అభిమానుల విజయం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రియాంక మోహన్ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.” అన్నారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!