‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.మధు, సంపత్ నంది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైనా ప్రతి ఒక్క అప్‌డెట్ ఎంతో ఆకట్టుకోగా రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. కట్ చేస్తే ట్రైలర్‌లో స్టోరీని దాచే ప్రయత్నం చేయలేదు.. ఓదెల గ్రామంలో గతంలో చనిపోయాడు అనుకున్న తిరుపతి (వశిష్ట సింహ) ప్రేతాత్మగా మారి అక్కడి జనాన్ని ఆవహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకు అడుగు పెడుతుంది శివుడిని ఆరాధించే శివశక్తి తమన్నా. అలా దేవుడికి.. దెయ్యానికి మధ్య వార్ జరుగనున్నట్లు గా చూపించారు. విజువల్స్ పరంగా సస్పెన్స్, థ్రిల్, హారర్ మూడు మిక్స్ చేయడంలో అశోక్ తేజ పనితనం కనిపిస్తుంది. అలాగే విరూపాక్ష, మంగళవారం లాంటి హిట్లకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనం చూపించాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయ్యింది. ‘ఓదెల2’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.18 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ గురించి చర్చలు సాగుతున్నాయట.
Also Read
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!