O Na Siddayya : గ్రౌండ్లో 70MM స్క్రీన్, డాల్బీ అట్మాస్‌తో సెన్సేషనల్ సాంగ్ లాంచ్ చేసిన సోనూసూద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సందడి, హంగామా థియేటర్ల దగ్గర కనిపిస్తుంది. కానీ, కేవలం ఒక ‘ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్’ లాంచ్ కోసం ఐదు వేల మంది తరలిరావడం, అది కూడా భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిలబడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సెన్సేషన్. సినిమా థియేటర్లో చూసే ఫీల్‌ను అవుట్‌డోర్‌లోనూ ఆడియన్స్‌కు అందించాలనే వినూత్న ఆలోచనతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ ఈ సరికొత్త రికార్డుకు తెరలేపింది. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఓపెన్ గ్రౌండ్లో 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్‌ను అత్యంత వైభవంగా లాంచ్ చేశారు. అక్టోబర్ 30 శుక్రవారం నాడు హైదరాబాద్, శంషాబాద్‌లోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా ‘రియల్ హీరో’ సోనూసూద్ హాజరయ్యారు.
సరిగ్గా ఈవెంట్ జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ, అక్కడున్న ఐదు వేల మందికి పైగా ప్రేక్షకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాటను ఎంజాయ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ఇలా ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ పాట సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్‌తో పాటు సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు.
Also Read
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
సిద్ధు రెడ్డి కందకట్ల, కత్యాయని జగన జంటగా నటించిన ఈ పాట.. భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను, దాంపత్య బంధం గొప్పదనాన్ని చాటిచెప్పే భావోద్వేగభరితమైన ప్రేమకథ. సిద్ధయ్య పాత్రలో నటించడమే కాకుండా ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి, తన నిజ జీవిత అనుభవాల స్ఫూర్తితోనే దీనికి రూపకల్పన చేశారు. కష్టసుఖాల్లో కలసి నడవడంతో పాటు, సమాజ సేవలోనూ పాలుపంచుకునే ఆదర్శ దంపతులుగా సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలను డిజైన్ చేశారు. రామ్ అద్నాన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ పాటకు కల్యాణ్ కీస్ అద్భుతమైన సంగీతం అందించారు. కేవలం పాట లాంచ్‌తోనే ఆగకుండా, సిద్ధు రెడ్డి ఈ వేదికగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించడంతో పాటు, సినీ కార్మికులకు భద్రతా హెల్మెట్లు పంపిణీ చేసి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఎవరూ ఊహించని రేంజ్లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!