NTRNeel : ‘డ్రాగన్’ యాక్షన్ పీక్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఇటీవల జోర్డాన్‌లో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ఇప్పుడు తదుపరి యాక్షన్ వేట కోసం సిద్ధమైంది. జోర్డాన్ షెడ్యూల్లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్లో కూడా భారీ యాక్షన్ ఉండబోతుందని తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం.
Also Read : JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
ఇందుకోసం నగర శివార్లలోని ఒక ప్రముఖ స్టూడియోలో మూడు భారీ సెట్లను నిర్మించారట. ఇందులో విలన్ ఇంటికి సంబంధించిన సెట్ కూడా ఉందట. దాదాపు నెల రోజులకు పైగా సాగే ఈ లాంగ్ షెడ్యూల్లో.. సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఇక్కడ షూటింగ్ పూర్తయిన వెంటనే, చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అక్కడ కూడా యాక్షనే ఉంటుందని టాక్. మొత్తంగా చూసుకుంటే.. డ్రాగన్ యాక్షన్ షెడ్యూల్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ యాక్షన్ డోస్ ఇవ్వబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ మరియు మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. డ్రాగన్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్‌తో బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!