‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌పై వస్తున్న వార్తలపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ‘గాడ్ ఆఫ్ వార్’ టైటిల్ గురించిన ప్రశ్నకు నాగవంశీ సూటిగా సమాధానమిచ్చారు. “గాడ్ ఆఫ్ వార్ అనేది అసలు సినిమా టైటిల్ కాదు. అందరూ అనుకుంటున్నట్లు ఆ పేరును మెయిన్ టైటిల్‌గా పెట్టడం లేదు. సినిమాలో ఒక పర్టిక్యులర్ ల్యాండింగ్, సన్నివేశం బట్టి దాన్ని ఎలా ప్లేస్ చేస్తారు, హీరోగారికి దాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు అనేది వేరే విషయమే తప్ప.. అది సినిమా పేరు మాత్రం కాదు” అని స్పష్టం చేశారు. దీంతో ఈ టైటిల్ చుట్టూ జరుగుతున్న ప్రచారానికి ఆయన ఒక్క మాటతో ఫుల్స్టాప్ పెట్టేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. దీనికితోడు రాక్‌స్టార్ అనిరుధ్ మ్యూజిక్ తోడవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ కేవలం టైటిల్ కాదని తేలడంతో, మరి ఈ క్రేజీ కాంబోకు ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెడతారో అని తారక్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!